మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bengaluru Rave Party: పేరు మార్చిన హేమ, అసలు పేరేంటో తెలిస్తే షాకవుతారు!

ABN, Publish Date - May 23 , 2024 | 05:23 PM

తెలుగు సినీ నటి హేమ ఇప్పుడు ట్రేండింగ్ లో వుంది. ఆమె బెంగుళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీకి వెళ్లి, తరువాత తాను వెళ్లలేదని బుకాయిస్తూ అదే ఫార్మ్ హౌస్ నుండి ఒక వీడియో పెట్టింది. తాజాగా ఆమె మాదకద్రవ్యాలు సేవించినట్టుగా రిపోర్ట్ వచ్చింది, ఇప్పుడు ఇక నోటీసులు అందుకోవాల్సిందే. అయితే లేనని చెప్పడానికి ఆమె కారణం ఆమె పేరు మార్చుకోవటమే, ఇంతకీ ఆమె అసలు పేరేంటో తెలుసా...

Actress Hema test positive for the consumption of drugs at a rave party in Bengaluru

బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు సంచలనాలకు దారితీస్తోంది. తెలుగు సినిమా రంగానికి చెందిన హేమ ఈ పార్టీకి హాజరవటమే కాకుండా, ఆ తరువాత అదే ఫార్మ్ హౌస్ నుండి అక్కడ తాను లేనని ఒక వీడియో చేసి అందరికీ పంపిన విషయం తెలిసిందే. ఆమె వీడియో చూసిన పోలీసులు ఆమె అదే ఫార్మ్ హౌస్ నుండి ఆ వీడియో పంపిందని, ఆమె పార్టీకి హాజరయిన వారిలో ఉందని ఖరారు చేశారు.

తాను లేనని చెప్పడం కోసం తాపత్రయపడిన హేమ బిర్యానీ తయారు చెయ్యడం గురించి ఇంకో వీడియో పెట్టింది. అప్పటికే నెటిజన్స్ ఆమెని ట్రోల్ చెయ్యడం మొదలెట్టేసారు. ఈలోపు బెంగుళూరు పోలీసులు అక్కడ హాజరైన వారందరి రక్త నమూనాలని తీసుకొని టెస్టులకు పంపారు. ఆ టెస్టులో ఒకవేళ వారు మాదక ద్రవ్యాలు సేవించినట్టయితే తెలిసిపోతుంది. ఆ టెస్టుల ఫలితాలు వచ్చేలోపు హేమ తాను అక్కడ లేనని చెప్పడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది.

ఈలోగా బెంగుళూరు పోలీసులు హేమ అక్కడ ఉన్నట్టు రూడీ చెయ్యడమే కాకుండా, ఆమెకి పాజిటివ్ వచ్చింది అని కూడా చెప్పారు. అంటే ఆమె మాదక ద్రవ్యాలు సేవించినట్టు ఖరారయింది. ఇంతకీ హేమ అంత ధైర్యంగా ఎలా చెపుతోంది తాను అక్కడ లేను అని విచారిస్తే, ఆమె అసలు పేరు హేమ కాదని తెలిసింది.

ఇంతకీ హేమ అసలు పేరు ఏంటో తెలుసా? కృష్ణవేణి. అక్కడ ఆమె హాజరైన పట్టికలో కృష్ణవేణిగా రాసినట్టుగా తెలిసింది. దానికితోడు బెంగుళూరు పోలీసులకి కూడా ఆమె కృష్ణ వేణి అని చెప్పినట్టుగా తెలిసింది. కృష్ణవేణి పేరుతో అక్కడకి వెళ్ళటం వలన, తాను వెళ్లలేదని బుకాయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఫోటోలు, టెస్టులు, చూసినవాళ్లు అంతమందిని బుకాయించలేరుగా! ఏమైనా, హేమ లేదా కృష్ణవేణి అడ్డంగా ఇప్పుడు దొరికిపోయింది. ఇంకేముంది ఇప్పుడు నోటీసులు అందుకోవాల్సిందే. అయితే ఈమెకి మాదకద్రవ్యం సేవించినందుకు గాను కొన్నిరోజులపాటు కౌన్సెలింగ్ ఇచ్చి పంపవచ్చని తెలిసింది.

Updated Date - May 23 , 2024 | 05:35 PM