రవికుమార్ చౌదరి ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి?
ABN, Publish Date - Sep 22 , 2024 | 02:33 AM
‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి హిట్ చిత్రాలు అందించి, ఇటీవల రాజ్‌తరుణ్ నటించిన ‘తిరగబడరా సామీ’ తో మరో విజయం అందుకొన్న దర్శకుడు రవికుమార్ చౌదరి తన కొత్త చిత్రం వివరాలు వెల్లడించారు. ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే...
‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి హిట్ చిత్రాలు అందించి, ఇటీవల రాజ్‌తరుణ్ నటించిన ‘తిరగబడరా సామీ’ తో మరో విజయం అందుకొన్న దర్శకుడు రవికుమార్ చౌదరి తన కొత్త చిత్రం వివరాలు వెల్లడించారు. ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సినిమా ఉంటుందని, న్యూ ఏజ్ లవ్‌స్టోరీగా రూపొందుతుందని ఆయన తెలిపారు. ‘లేనిది ఎవరికి?’ అనేది ట్యాగ్ లైన్. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు రచన: డైమండ్ రత్నబాబు, పాటలు: సుద్దాల అశోక్ తేజ, వరంగల్ శ్రీను, సంగీతం: జేబీ, ఛాయాగ్రహణం: ప్రభాకరరెడ్డి, సమర్పణ: రిగ్వేద చౌదరి. నటీనటులు, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాత కార్తీక్ రెడ్డి రాకాసి చెప్పారు.