ఎంత గౌరవమో!
ABN, Publish Date - Sep 15 , 2024 | 02:45 AM
తెలుగుజాతి గర్వించదగ్గ నటుడు నందమూరి తారకరామారావు. చిత్ర పరిశ్రమలో తను ఎదుగుతూ మరెందరికో అవకాశాలు కల్పించి ఆదుకున్న మంచి వ్యక్తిగా ఎన్టీఆర్‌కు పేరుంది...
ఫ్లాష్‌బ్యాక్
తెలుగుజాతి గర్వించదగ్గ నటుడు నందమూరి తారకరామారావు. చిత్ర పరిశ్రమలో తను ఎదుగుతూ మరెందరికో అవకాశాలు కల్పించి ఆదుకున్న మంచి వ్యక్తిగా ఎన్టీఆర్‌కు పేరుంది. అలా ఆయన ఆశీస్సులతో తన కెరీర్‌ను చక్కగా మలుచుకున్న పాత తరం హీరోల్లో కాంతారావు ఒకరు. తొలి సినిమా ‘ప్రతిజ్ఞ’ తర్వాత సరైన అవకాశాలు లేక ఇంటికి తిరిగి వెళ్లిపోదామనుకున్న ఆయన్ని పిలిచి తన సొంత చిత్రం ‘జయసింహ’లో తనతో సమానమైన పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు ఎన్టీఆర్. అలాగే ‘లవకుశ’ సినిమాలో లక్ష్మణుడి పాత్ర కూడా ఎన్టీఆర్ గట్టి రికమండేషన్‌తోనే కాంతారావుకు దక్కింది. అలా ఎన్నో సార్లు తనని ఆదుకొన్న ఎన్టీఆర్ అంటే కాంతారావుకు ఎంతో అభిమానం, గౌరవం. కాంతారావు సొంత సినిమా పూజా కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరైన అరుదైన దృశ్యం ఇది. ఇందులో హీరోయిన్ జయంతి కూడా ఉన్నారు.