సెట్స్‌లోకి స్వాగతం
ABN, Publish Date - Oct 21 , 2024 | 03:34 AM
హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్ 4 త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన..
హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్ 4 త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. చంద్రబాబునాయుడుకు బాలకృష్ణ పుష్పగుచ్ఛం అందించి సెట్స్‌లోకి ఆహ్వానించారు. గతంలో అన్‌స్టాపబుల్ సీజన్ 3లో సైతం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ఆయన పంచుకోనున్నారు. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్ 4లో తొలి ఎపిసోడ్ ఈ నెల 25న స్ట్రీమింగ్ అవనుంది.