Weekend: కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ 'వీకెండ్'  

ABN, Publish Date - Nov 28 , 2024 | 08:33 PM

పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న వీకెండ్ (weekend Movie) సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. 



వి ఐ పి శ్రీ హీరోగా, ప్రియా దేషపాగ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'వీకెండ్' (WEEKEND) . ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐ డీ భారతీ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బి. రాము (B Ramu) దర్శకుడు. పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న వీకెండ్ (weekend Movie) సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్ఆర్ఐ జయ కెమెరా రోల్ చేయగా, సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ మొదట క్లాప్ కొట్టారు. షూట్ మొదలు పెట్టిన అనంతరం ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ అంతా చీరాల లోనే జరగబోతుందని చిత్ర దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 08:33 PM