కూర్గ్‌లో పెళ్లి

ABN, Publish Date - Aug 20 , 2024 | 02:37 AM

‘రాజావారు..రాణీగారు’ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ల వివాహం ఈ నెల 22న కర్నాటక రాష్ట్రంలోని కూర్గ్‌లో జరుగుతుంది. రహస్య బంధువులంతా కూర్గ్‌లో ఉండడంతో...

‘రాజావారు..రాణీగారు’ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ల వివాహం ఈ నెల 22న కర్నాటక రాష్ట్రంలోని కూర్గ్‌లో జరుగుతుంది. రహస్య బంధువులంతా కూర్గ్‌లో ఉండడంతో అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సన్నిహితులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో ఈ పెళ్లి జరుగుతుంది. దాదాపు ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉన్న కిరణ్‌, రహస్య ఈ ఏడాదే తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు.

వరల్డ్‌ ఆఫ్‌ వాసుదేవ్‌ : కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్‌ థ్రిల్లర్‌ ‘క’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘వరల్డ్‌ ఆఫ్‌ వాసుదేవ్‌’ను సోమవారం విడుదల చేశారు. సనాపతి భరద్వాజ పాత్రుడు రాసిన ఈ పాటను కపిల్‌ కపిలన్‌ పాడారు. దర్శకద్వయం సుజిత్‌, సందీప్‌ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ‘క’ చిత్రాన్ని త్వరలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి విడుదల చేయసున్నారు.

Updated Date - Aug 20 , 2024 | 02:39 AM