విజయంపై నమ్మకంతో ఉన్నాం

ABN, Publish Date - Sep 11 , 2024 | 04:16 AM

మలయాళ హీరో టోవిన్‌ థామస్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఏఆర్‌ఎం’ (అజయంతే రందం మోషణం). జితిన్‌లాల్‌ దర్శకుడు. కృతిశెట్టి, ఐశ్వర్యారాజేశ్‌, సురభి లక్ష్మి కథానాయికలు...

మలయాళ హీరో టోవిన్‌ థామస్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఏఆర్‌ఎం’ (అజయంతే రందం మోషణం). జితిన్‌లాల్‌ దర్శకుడు. కృతిశెట్టి, ఐశ్వర్యారాజేశ్‌, సురభి లక్ష్మి కథానాయికలు. ఈ నెల 12న పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. మంగళవారం చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా టోవినో థామస్‌ మాట్లాడుతూ ‘మైత్రీ మూవీ మేకర్స్‌ అంటే తెలుగు పరిశ్రమలో ఒక బ్రాండ్‌. వారు మా సినిమాను తెలుగులో విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఇందులో మూడు పాత్రలు చేశాను. కృతి శెట్టి పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నాం. తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’ అని కోరారు. కృతిశెట్టి మాట్లాడుతూ ‘హీరోయిన్‌గా నాకు ఇది తొలి మలయాళ చిత్రం. దర్శకుడు అద్భుతమైన కథతో ఎనిమిదేళ్ల పాటు కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’ అని చెప్పారు.

Updated Date - Sep 11 , 2024 | 04:16 AM