రెండింతల వినోదంతో వస్తున్నాం

ABN, Publish Date - Aug 12 , 2024 | 03:14 AM

‘రామ్‌ పోతినేని లేకపోతే ఇస్మార్ట్‌ శంకర్‌ లేడు. డబుల్‌ ఎనర్జీతో ఈ సినిమా చేశాడు. సంజయ్‌దత్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన నటన ఈ సినిమాకు ప్రత్యేకార్షణ. రామ్‌ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి...

‘రామ్‌ పోతినేని లేకపోతే ఇస్మార్ట్‌ శంకర్‌ లేడు. డబుల్‌ ఎనర్జీతో ఈ సినిమా చేశాడు. సంజయ్‌దత్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన నటన ఈ సినిమాకు ప్రత్యేకార్షణ. రామ్‌ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సినిమాను బ్లాక్‌బస్టర్‌ చేయండి’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ప్రేక్షకులను కోరాడు. ఆయన దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం వరంగల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్‌ మాట్లాడుతూ ‘‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు మించేలా ‘డబుల్‌ ఇస్మార్ట్‌ ఉంటుంది. పూరి జగన్నాథ్‌ గన్‌ లాంటివారు. గన్‌ బావుంటే బుల్లెట్‌ ఎంత ఫోర్స్‌తో అయినా వెళుతుంది. పూరి గారి లాంటి గన్‌ అందరి యాక్టర్స్‌కి కావాలని ఈ సినిమాతో తెలిసింది.


సంజయ్‌దత్‌తో పనిచేసినందుకు ఆనందంగా ఉంది’ అన్నారు. పాటలు ప్రజాదరణ పొందాయి, సినిమా కూడా ఘన విజయం అందుకుంటుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాత ఛార్మీ కౌర్‌. డబుల్‌ కామెడీ, డబుల్‌ యాక్షన్‌, డబుల్‌ మ్యాజిక్‌లా సినిమా ఉండబోతోందని కథానాయిక కావ్య థాపర్‌ చెప్పారు.

Updated Date - Aug 12 , 2024 | 07:49 AM