Vrushabha: ‘వృషభ’ ట్రైలర్ మరియు సాంగ్ విడుదల

ABN , Publish Date - May 08 , 2024 | 07:46 PM

వీకే మూవీస్ అండ్ శ్రీ జెపి ప్రొడక్షన్స్ ప‌తాకాలపై జీవ‌న్ రెడ్డి, అలేఖ్య జంట‌గా ఉమా శంక‌ర్ రెడ్డి నిర్మాత‌గా, మల్లికా రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా, అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వృష‌భ‌’. నటుడు జయప్రకాష్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్, లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Vrushabha: ‘వృషభ’ ట్రైలర్ మరియు సాంగ్ విడుదల
Vrushabha Trailer and Song Launch Event

వీకే మూవీస్ అండ్ శ్రీ జెపి ప్రొడక్షన్స్ ప‌తాకాలపై జీవ‌న్ రెడ్డి, అలేఖ్య జంట‌గా ఉమా శంక‌ర్ రెడ్డి నిర్మాత‌గా, మల్లికా రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా, అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వృష‌భ‌’ (Vrushabha). నటుడు జయప్రకాష్ రెడ్డి (Jayaprakash Reddy) జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ట్రైల‌ర్, లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర (V Samudra) మాట్లాడుతూ.. ‘ట్రైల‌ర్‌తో పాటు ఒక పాట విన్నాం.. చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్స్ చాలా నేచ‌ర‌ల్‌గా ఉన్నారు. ద‌ర్శ‌కుడుకి ఈ చిత్రం మంచి పేరు తేవాల‌ని కోరుకుంటూ నిర్మాత‌కు శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నానని అన్నారు.

ద‌ర్శ‌కుడు రేలంగి న‌ర‌సింహారావు (Relangi Narasimha Rao) మాట్లాడుతూ.. ట్రైల‌ర్ చూడ‌గానే ఇది డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ అనిపించింది. విన్న పాట కూడా చాలా బావుంది. సంగీతం, సాహిత్యం, సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి కుమార్తె నిర్మాత‌గా చేయ‌డం సంతోషం. ఈ చిత్ర ద‌ర్శ‌కనిర్మాత‌ల‌కు నా శుభాకాంక్ష‌లని అన్నారు. సీనియ‌ర్ నిర్మాత దామోదర్ ప్ర‌సాద్ (Damodar Prasad) మాట్లాడుతూ.. ట్రైల‌ర్, విన్న పాట, టైటిల్ చాలా బావున్నాయి. క‌ళ ప‌ట్ల అభిమానంతో ఈ టీమ్ సినిమా చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు అని తెలపగా.. ల‌యన్ సాయి వెంక‌ట్ (Lion Sai Venkat) మాట్లాడుతూ.. జ‌య ప్ర‌కాష్ రెడ్డి గారి కుమార్తె ఈ సినిమాతో కో ప్రొడ్యూస‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ట్రైల‌ర్, మ్యూజిక్ బాగుంది. గోమాత మీద సినిమా తీయ‌డం ఇదే ప్ర‌థమం. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నానని అన్నారు.


Tollywood.jpg

చిత్ర ద‌ర్శ‌కుడు అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల మాట్లాడుతూ.. మా ప్రొడ్యూస‌ర్ ఉమా శంక‌ర్ గారు ఒక మంచి క‌థ రాసుకొని న‌న్ను అప్రోచ్ అయ్యారు. ఈ కాన్సెప్ట్ మీద చాలా హార్డ్ వ‌ర్క్ చేశాం. టీమ్ అంతా ఎంతో బాగా స‌హ‌క‌రించారు. హీరో జీవ‌న్ రెడ్డి గారు సినిమా కోసం ప్రాణం పెట్టారు. హీరోయిన్ కూడా ఎంతో శ్ర‌మించారు. సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ బాగా కుదిరింది. ఎమ్ ఎల్ రాజా నాకు మంచి మిత్రుడు. అద్భుత‌మైన పాట‌లిచ్చారు. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు రిలీజ్ చేస్తామని తెలిపారు. కో-ప్రొడ్యూస‌ర్ మ‌ల్లిక రెడ్డి మాట్లాడుతూ.. మా నాన్న‌గారి బ‌ర్త్ డే రోజు మా సినిమాకు సంబంధించిన పాట‌, ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం సంతోషం. ఈ సినిమాలో నన్ను భాగ‌స్వామిగా చేసిన ఉమా శంక‌ర్ రెడ్డి గారికి ధ‌న్య‌వాదాలు. ఒక మంచి సినిమాలో పార్ట్ కావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

Read Latest Cinema News

Updated Date - May 08 , 2024 | 07:46 PM