Viswam: ‘గుంగురు గుంగురు’ సాంగ్.. కావ్య హీట్ పెంచేస్తోంది
ABN, Publish Date - Oct 10 , 2024 | 08:30 PM
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యిందీ చిత్రం. ఈ మూవీ నుంచి గురువారం ఓ మాంచి మాస్ బీట్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఈ పాటలో కావ్య తన గ్లామర్‌తో, స్టెప్స్‌తో హీట్ పెంచుతోంది.
మాచో స్టార్ గోపీచంద్ (Gopichand), దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’ (Viswam). దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యిందీ చిత్రం. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినియా టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి స్పందన రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుండి మాంచి మాస్ బీట్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ వాయిదా? ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి వచ్చినా సమస్యే?
‘గుంగురు గుంగురు’ (Gunguru Gunguru Lyrical Song) అంటూ సాగిన ఈ పాటను సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) మాస్ బీట్స్‌తో పెర్ఫెక్ట్ ఫెస్టివల్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. ఆ మాస్ బీట్‌కు తగినట్లుగా సురేష్ గంగుల రాసిన మ్యాసీ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భీమ్స్ సిసిరోలియో, ‘మాయిపిలో’ రోహిణి సోరట్ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో అదరగొట్టారు. ఇక పాటంతా ఒక ఎత్తయితే ఈ సాంగ్‌లో గోపీచంద్, కావ్యా థాపర్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ మరో ఎత్తు అన్నట్లుగా అదరగొట్టారు. ఈ మూవీ పాటల్లో కావ్య మొదటి నుంచీ హీట్ పెంచుతున్నట్లే.. ఈ పాటలోనూ తన గ్లామర్ ప్రతిభను కనబరిచింది. వైబ్రెంట్ సెట్స్‌లో షూట్ చేసిన ఈ సాంగ్‌లోని విజువల్స్ కూడా చాలా గ్రాండ్‌గా వున్నాయి. థియేటర్స్‌లో ఈ సాంగ్ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్టయన్... ది హంటర్’ ఎలా ఉందంటే..
గోపీచంద్, కావ్య థాపర్ (Kavya Thapar), వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెవి గుహన్ టాప్ క్లాస్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్ డైరెక్టర్‌గా కిరణ్ మన్నె బాధ్యతలను నిర్వహించారు. ఈ సినిమా ఈ శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.