Kunal Kapoor: కునాల్ కపూర్‌కు ‘విశ్వంభర’ టీమ్ స్వాగతం..

ABN , Publish Date - Jun 14 , 2024 | 01:46 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇస్తోన్న ఒక్కో అనౌన్స్‌మెంట్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తోంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ‘విశ్వంభర’ టీమ్.. కమాండింగ్ పర్సనాలిటీ కునాల్ కపూర్‌ను ఈ మ్యాజిస్టిక్ వరల్డ్‌కి స్వాగతించింది.

Kunal Kapoor: కునాల్ కపూర్‌కు ‘విశ్వంభర’ టీమ్ స్వాగతం..
Kunal Kapoor In Chiru Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇస్తోన్న ఒక్కో అనౌన్స్‌మెంట్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తోంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట (Vassishta) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకుడు వశిష్ట అన్నీ క్రాఫ్ట్స్‌లో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. తాజాగా ‘విశ్వంభర’ టీమ్.. కమాండింగ్ పర్సనాలిటీ కునాల్ కపూర్‌ (Kunal Kapoor)ను ఈ మ్యాజిస్టిక్ వరల్డ్‌కి స్వాగతించింది.

Also Read-Maharaja Movie Review: విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే...


‘రంగ్ దే బసంతి, డాన్ 2, డియర్ జిందగీ’ వంటి అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించిన కునాల్ కపూర్ ‘విశ్వంభర’లో ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం ఎంపికయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు కునాల్ కపూర్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుండగా.. ఆయనకు ఈ సినిమాతో అవకాశం వరించింది. కునాల్ కపూర్‌కు స్వాగతం పలుకుతూ ‘విశ్వంభర’ టీమ్ ఇచ్చిన అప్‌డేట్‌తో ప్రస్తుతం ఈ సినిమా ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది (Kunal Kapoor in Vishwambhara). అయితే కునాల్ కపూర్ కంటే ముందు ఈ పాత్ర కోసం రానా దగ్గుబాటిని అనుకున్నారు. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో కునాల్ కపూర్‌కు ఛాన్స్ వరించింది. రానా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా చిత్రజ్యోతి ప్రకటించిన ఆర్టికల్ చదివేందుకు క్రింది లింక్ క్లిక్ చేయండి..

*Chiranjeevi: చిరంజీవి సినిమా నుండి తప్పుకున్న రానా దగ్గుబాటి, కారణం ఇదేనట...


Kunal-Kapoor-Pic.jpg

‘విశ్వంభర’లో త్రిష కృష్ణన్ (Trisha Krishnan), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వీరే కాకుండా సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి వంటి వారు కూడా ఇందులో కీలక పాత్రలలో నటిస్తున్నట్లుగా ఇప్పటికే టాక్ వైరల్ అవుతోంది. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తోన్న ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌కు ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాను 2025 సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Vishwambhara Latest Update)

Read Latest Cinema News

Updated Date - Jun 14 , 2024 | 02:32 PM