Vishwak Sen: దమ్ముంటే ఆ పని చెయ్ అంటూ.. యూట్యూబర్‌పై ఫైర్..

ABN , Publish Date - Jun 19 , 2024 | 10:41 AM

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌పై రివ్యూ ఇస్తున్న ఓ యూట్యూబర్‌పై మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వారు చలనచిత్ర పరిశ్రమలో పైరసీ కంటే కూడా ప్రమాదం అని చెబుతూ.. సదరు యూట్యూబర్‌కు విశ్వక్ ఓ ఛాలెంజ్ కూడా విసిరారు. విశ్వక్ చేసిన ఈ కామెంట్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. అది అలా అడుగన్నా అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.

Vishwak Sen: దమ్ముంటే ఆ పని చెయ్ అంటూ.. యూట్యూబర్‌పై ఫైర్..
Hero Vishwak Sen

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898AD) ట్రైలర్‌పై రివ్యూ ఇస్తున్న ఓ యూట్యూబర్‌పై మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass ka Das Vishwak Sen) ఫైర్ అయ్యారు. ఇలాంటి వారు చలనచిత్ర పరిశ్రమలో పైరసీ కంటే కూడా ప్రమాదం అని చెబుతూ.. సదరు యూట్యూబర్‌ (Youtuber)కు విశ్వక్ ఓ ఛాలెంజ్ కూడా విసిరారు. విశ్వక్ చేసిన ఈ కామెంట్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. అది అలా అడుగన్నా అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకీ విశ్వక్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..

Also Read- Vijay: విజయ్‌ పార్టీలో చేరనున్న ఆ ఇద్దరు నటులు?


‘‘సినిమాలు రిలీజ్ కూడా అవకముందే చెంబు పట్టుకొని బయలుదేరుతున్నారు యూట్యూబ్‌లో మీ ఇన్‌కమ్ కోసం. వేల కుటుంబాలు ఆధారపడి ఉన్న ఇండస్ట్రీపై మజాక్‌లు అయిపోయాయి మీకు. వీడు ఒక 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం మనం. లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్లు అనుకుని వదిలేద్దాం. ఇలాంటి అభిప్రాయాలు బజారులో పెట్టి తిరిగేవాళ్లంతా 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి. (Vishwak Sen vs Youtuber)


Vishwak-Sen-Youtuber.jpg

ఇలాంటి వారు పైరసీ కంటే కూడా చాలా ప్రమాదకరం. ప్రతి రోజూ సెట్‌లో ఎంతో మంది స్వేదం, రక్తం పెట్టి వర్క్ చేస్తారనే విషయం వీళ్లకి తెలియాలని కోరుకుంటున్నాను. నువ్వు తియ్యి ఒక 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌ని. అప్పుడు నీకు, నీ అభిప్రాయానికి రెస్పెక్ట్ ఉంటది. ఆవేశంలో నేను కూడా టైప్ చేసేశా. కావాలంటే మనం లైవ్‌లో ఓపెనియన్స్ మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఒకసారి నాగ వంశీగారితో ఓపెన్ కిడ్నీ మీటింగ్ అయ్యింది. పోయి షార్ట్ ఫిల్మ్ తియ్యి ఫస్ట్.. ఇంగ్లీష్ బాగా వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పెట్టుకో.. ఇంక నీ పౌరుషం తీసి.. లైవ్‌లో కూర్చోవాలా? నీ ఓపెన్ కిడ్నీ కూడా తీసి.. ఆశకి హద్దుండాలి’’ అంటూ ‘గుంటురు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌ని యాడ్ చేశారు విశ్వక్ తన ఇన్‌స్టా స్టోరీలో. విశ్వక్ తన ఇన్‌స్టా స్టోరీలో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. (Vishwak Sen Insta Post)

Read Latest Cinema News

Updated Date - Jun 19 , 2024 | 10:41 AM