Vishwak Sen: ఎందుకు? ట్రోలింగ్‌ కారణమా?

ABN, Publish Date - Jun 28 , 2024 | 02:44 PM

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్  (Vishwak sen) సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇన్‌స్టాలో తరచూ పోస్ట్‌లు పెడుతుంటారు, అభిమానులకు అందుబాటులో ఉంటారు.

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్  (Vishwak sen) సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇన్‌స్టాలో తరచూ పోస్ట్‌లు పెడుతుంటారు, అభిమానులకు అందుబాటులో ఉంటారు. తనపై వచ్చిన విమర్శలకు, ట్రోల్స్‌కు తనదైన శైలిలో కౌంటర్‌ ఇస్తుంటారు. తాజాగా విశ్వక్‌ ఇన్‌స్టా అకౌంట్‌ డిలీట్‌ (Insta Account delete) చేసినట్లు కనిపిస్తుండడంతో ఆయన అభిమానులు ఎక్స్‌లో (ట్విట్టర్‌)లో కామెంట్స్‌ పెడుతున్నారు. తాజాగా విశ్వక్‌సేన్  తన ఇన్‌స్టాలో స్టోరీలో పెట్టారు. సోషల్‌ మీడియా నుంచి దూరమవుతున్నట్లు అందులో పేర్కొన్నారు. కొన్ని రోజులు పోస్ట్‌లకు దూరంగా ఉంటారేమో అని అందరూ భావించారు. కానీ అసలు ఇప్పుడు ఇన్  స్టాగ్రామ్  అకౌంట్‌ కనిపించడం లేదు. దీంతో కారణమేంటంటూ ఆయన అభిమానులు ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. యూట్యూబ్‌, సోషల్‌ మీడియాల్లో నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చేవారిపై విశ్వక్‌ సేన ఇటీవల ఫైర్‌ అయ్యారు. దీనిపై తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఓ యూట్యూబర్‌ ‘కల్కి’ రిలీజ్‌ కాకముందే రివ్యూ ఇవ్వడంపై ఆయన తప్పు పట్టారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ చర్చల రొంపిలో దిగడం ఎందుకు అనే ఆయన ఇంస్టాగ్రామ్  డిలీట్‌ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ ఏడాది 'గామి’, 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 

Updated Date - Jun 28 , 2024 | 03:04 PM