విష్వక్ వినోదం
ABN, Publish Date - Aug 08 , 2024 | 04:34 AM
విష్వక్‌సేన్ హీరోగా నటించే 14వ చిత్రాన్ని బుధవారం ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ‘జాతిరత్నాలు’ చిత్ర దర్శకుడు అనుదీప్ కేవీ...
విష్వక్‌సేన్ హీరోగా నటించే 14వ చిత్రాన్ని బుధవారం ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ‘జాతిరత్నాలు’ చిత్ర దర్శకుడు అనుదీప్ కేవీ ఈ సినిమాకు దర్శకుడు. హిలేరియస్ ఎంటర్‌టైనర్స్ అందించడంలో అనుదీ్‌పకు మంచి పేరు ఉంది. అందుకే ఈసారి కూడా ఆయన విష్వక్‌సేన్‌తో నవ్వుల వర్షం సృష్టించనున్నారని నిర్మాత చెప్పారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని, సురేశ్ సారంగం ఫొటోగ్రఫీని అందించనున్నారు. సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.