Hema: వైరల్ ఫీవర్... రాలేను
ABN, Publish Date - May 28 , 2024 | 03:42 AM
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు నటి హేమ కూడా సోమవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు...
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు నటి హేమ కూడా సోమవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ నటి హేమ ఈ విచారణకు హాజరుకాలేనని.. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని తెలిపారు. విచారణకు హాజరు కావడానికి మరికొంత సమయం కావాలని కోరారు.
ఇదిలా ఉంటే హేమ సోమవారం ఉదయం ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడారు. ‘‘మనం తప్పుచేయనంత వరకూ ఏ విషయంలో అస్సలు భయపడాల్సిన పనిలేదు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోవడానికి మనమేం దేవుళ్లం కాదు కదా. ఒకవేళ.. తప్పు జరిగినా ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ చెపితే సరిపోతుంది. అప్పుడు మనం మనశ్శాంతిగా ఉంటాం. ఏ విషయంలోనైనా అబద్ధాలు చెప్పకపోతేనే మంచిది. ఒక అబద్ధం చెబితే.. దానిని కవర్ చేయడానికి మరో వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. నేను అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడను. అందుకే నేను ఆనందంగా ఉన్నాను’’ అని లైవ్ వీడియోలో పేర్కొన్నారు.