Vinesh Phogat : నీ వెంటే మేమంతా
ABN, Publish Date - Aug 08 , 2024 | 04:42 AM
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన భారత కుస్తీ క్రీడాకారిణి వినేశ్ ఫొగాట్ పతకం సాధించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించడం ఖాయమని భావించిన తరుణంలో...
వినేశ్ ఫొగాట్‌కు సినీతారల మద్దతు
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన భారత కుస్తీ క్రీడాకారిణి వినేశ్ ఫొగాట్ పతకం సాధించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించడం ఖాయమని భావించిన తరుణంలో ఆమె అనూహ్య నిష్క్రమణ దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను నిరాశకు గురిచేసింది. వంద గ్రాముల బరువు పెరిగారనే కారణంతో ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయడం సగటు అభిమానితో పాటు సెలబ్రిటీలను కలచివేసింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు వినేశ్‌కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో పలువురు సినీ తారలు సైతం సోషల్ మీడియా ద్వారా వినేశ్‌కు ధైర్య వచనాలు చెప్పారు.
పతకం గెలిచినా, గెలవకపోయినా మీరు నిజమైన ఛాంపియన్ అని అందరికి చూపించారు. ఫలితాన్ని మీరు స్వీకరించిన తీరు, కష్ట సమయంలో మీరు చూపిన నిబ్బరం మా అందరికీ స్ఫూర్తిదాయకం. మీ స్ఫూర్తి మాలోని ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తోంది. 140 కోట్ల హృదయాలు మీతో ఉన్నాయి.
మహేశ్ బాబు
ఎంత పోరాట పటిమ కనబరిచేవారైనా కొన్నిసార్లు కఠినమైన అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఒంటరి కాదు. కష్టసుఖాల్లో మేమంతా మీ వెన్నంటే ఉంటాం. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడిన మీ తీరు ప్రశంసనీయం
సమంత
విజయమనే తూనికలో ఇమిడే ప్రతిభ కాదు నీది. నీ ఆటతీరుతో ఎంతోమందిని ప్రభావితం చేశావు. మా మనసుల్లో గొప్ప సాఽ్థనం పొందావు. మా అందరి ప్రేమాభిమానాలు నీతోనే ఉంటాయి. గర్వంగా తలెత్తుకొని నిలబడు.
నయనతార
జాతి యావత్తుకు మీరు స్ఫూర్తిగా నిలిచారు. యోధురాలుగా కొన్ని తరాలు మిమ్మల్ని గుర్తుంచుకుంటాయి. ఇలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చినా చరిత్ర సృష్టించకుండా మిమ్మల్ని ఆపలేదు. పట్టుదలను, ధైర్యాన్ని, కష్టాన్ని మీ నుంచి దూరం చేయలేవు. మీలాంటి వారు మరొకరు లేరు.
అలియాభట్
వినేశ్ నిష్క్రమణ నిరాశ కలిగించింది. ఆమె మనందరి హృదయాలను గెలుచుకు న్నారు.
తాప్సీ
వినేశ్ నువ్వో యోధురాలివి. నిన్ను చూసి గర్విస్తున్నా. నువ్వు సాధించింది పతకాల కంటే ఎక్కువ
దర్శకురాలు జోయా అక్తర్
మీరెప్పుడూ ఛాంపియనే
సోనాక్షిసిన్హా