మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Santhana Prapthirasthu: ‘సంతాన ప్రాప్తిరస్తు’ టైటిల్‌తో చిత్రం.. క్లాప్ కొట్టారు

ABN, Publish Date - May 18 , 2024 | 06:11 PM

అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు టైటిల్‌తో ఓ చిత్రం టాలీవుడ్‌లో లాంచనంగా ప్రారంభమైంది. విక్రాంత్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ‘సంతాన ప్రాప్తిరస్తు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Santhana Prapthirasthu Movie Pooja Event

అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు టైటిల్‌తో ఓ చిత్రం టాలీవుడ్‌లో లాంచనంగా ప్రారంభమైంది. విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోహీరోయిన్లుగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santhana Prapthirasthu) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి (Madhura Sreedhar Reddy), నిర్వి హరిప్రసాద్ రెడ్డి (Nirvi Hariprasad Reddy) నిర్మిస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ’ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, వ్యాపారవేత్త అంబికా కృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజు క్లాప్ కొట్టారు. మధుర శ్రీధర్ రెడ్డి ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం చేశారు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ స్క్రిప్ట్‌ను దర్శకుడు సంజీవ్ రెడ్డికి అందజేశారు.

*Pushpa 2: అల్లు అర్జున్ చేసిన పని 'పుష్ప 2' పై ప్రభావం చూపిస్తుందా?


ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) మాట్లాడుతూ.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ప్రస్తుతం థియేటర్లకు ఫ్యామిలీ ఆడియెన్స్ రావడం లేదు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను రప్పించేలా.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటూనే ఒక కాంటెంపరరీ ఇష్యూను ఈ సినిమాలో చూపిస్తున్నాం. వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి మధ్య కథ జరుగుతుంది. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా మూవీలో తెరకెక్కిస్తున్నామని తెలిపారు. (Santhana Prapthirasthu Movie Launched)


నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. మా సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’ లాంఛనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ వేడుకకు వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. మంచి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సునీల్ కశ్యప్ మా చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతామని అన్నారు. (Santhana Prapthirasthu)

Read Latest Cinema News

Updated Date - May 18 , 2024 | 06:11 PM