మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Arrest warrant on Prudhviraj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్విరాజ్ పై అరెస్టు వారెంట్ జారీ

ABN, Publish Date - Jun 13 , 2024 | 11:37 AM

30ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ నటుడు పృథ్విరాజ్ పై విజయవాడకి చెందిన ఫామిలీ కోర్ట్ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. పృథ్విరాజ్ కోర్టు ఆదేశాల మేరకి తన భార్యకి నెలకి రూ. 8 లక్షల భరణం ఇవ్వాల్సి ఉండగా, అది ఇవ్వలేదని తెలిసింది. అదీ కాకుండా కోర్టుకు హాజరు కానందున ఈ అరెస్టు వారంట్ జారీ అయినట్టుగా తెలిసింది.

Actor Prudhviraj

కమెడియన్ నటుడు పృథ్విరాజ్ కు షాకు ఇచ్చింది విజయవాడ ఫామిలీ కోర్టు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ నటుడు పృథ్విరాజ్, తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెలా భరణం చెల్లించాలని విజయవాడ ఫామిలీ కోర్టు గతంలో ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను పృథ్విరాజ్ పక్కన పెట్టడమే కాకుండా, కోర్టుకు హాజరు కానందున, పృథ్విరాజ్ అరెస్టుకు కోర్ట్ వారెంట్ జారీ చేసినట్టుగా తెలిసింది. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ అని కూడా తెలిసింది.

విజయవాడకి చెందిన శ్రీలక్ష్మి నటుడు పృద్విరాజుని 1984లో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక కుమారుడు, కుమార్తె వున్నారు. వీరి మధ్య మనస్పర్థలు రావటంతో పృథ్విరాజ్ భార్యతో కాకుండా విడిగా వున్నాడు. శ్రీలక్ష్మి తన ఇద్దరి పిల్లలను తీసుకొని పుట్టింట్లో వున్నారు. 2017లో శ్రీలక్ష్మి కోర్టుకు వెళ్లి, న్యాయపరంగా తనకి తన భర్త పృథ్విరాజ్ నెలకి రూ.8 లక్షల రూపాయలు భరణం చెల్లించాలని కోర్టువారిని కోరింది.

అందుకు కోర్టు కూడా అంగీకరించింది, అలాగే శ్రీలక్ష్మి న్యాయపోరాటానికి అయ్యే ఖర్చులు కూడా పృథ్విరాజ్ భరించాలని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. పృథ్విరాజ్ సినిమాల్లోకి వెళ్ళాక తనని బాగా వేధించేవాడని, అందుకని తాను 2016 ఏప్రిల్ నెలలో తన పుట్టింటికి వచ్చేశానని అప్పట్లో శ్రీలక్ష్మి కోర్టుకు చెప్పారు. అలాగే తన భర్త సినిమాల ద్వారా, టీవిలో నటించడం ద్వారా నెలకి సుమారు రూ. 30 లక్షల వరకు సంపాదిస్తున్నాడని, అతని నుంచి తనకి భరణం ఇప్పించాలని 2017, జనవరిలో కోర్టులో కేసు ఫైల్ చేసింది శ్రీలక్ష్మి.

కోర్టు వాదనలు వినిన తరువాత పృథ్విరాజ్ కి రూ. 8 లక్షలు ప్రతి నెలా 10వ తేదీలోగా ఆమెకి భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పుడు పృథ్విరాజ్ ఈ భరణం చెల్లించడం లేదని, అదీ కాకుండా కోర్టుకు కూడా హాజరు కానందున అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది.

Updated Date - Jun 13 , 2024 | 11:38 AM