గర్వంగా ఉంది : విజయ్‌సేతుపతి
ABN, Publish Date - Dec 16 , 2024 | 04:48 AM
వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి నటించిన చిత్రం ‘విడుదల 2’. గతేడాది రిలీజైౖ విజయం సాధించిన ‘విడుదల’ పార్ట్ 1కు కొనసాగింపుగా ఇది తెరకెక్కింది. సూరి, మంజు వారియర్ కీలక పాత్రల్లో...
వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి నటించిన చిత్రం ‘విడుదల 2’. గతేడాది రిలీజైౖ విజయం సాధించిన ‘విడుదల’ పార్ట్ 1కు కొనసాగింపుగా ఇది తెరకెక్కింది. సూరి, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటించారు. నిర్మాత చింతపల్లి రామారావు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 20న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్‌సేతుపతి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నటించినందుకు ఎంతో గర్వంగా ఉంది. నా సినిమాల్ని ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల సపోర్ట్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇళయరాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణ. చిత్రం తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇది తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్న సినిమా’’ అని నిర్మాత చింతపల్లి రామారావు అన్నారు.