రెండు భాగాలుగా విజయ్ సినిమా
ABN, Publish Date - Aug 06 , 2024 | 04:59 AM
విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వీడీ 12’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో విజయ్ లుక్‌ను...
విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వీడీ 12’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో విజయ్ లుక్‌ను రిలీజ్ చేశారు. కంప్లీట్ రఫ్ లుక్‌లో ఉన్న విజయ్‌ను చూసి బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయం అని అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు. తాజాగా, జరిగిన ఓ మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత ఈ సినిమా ఓ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ‘‘గౌతమ్ తిన్ననూరి, విజయ్ కలియకలో తెరకెక్కే సినిమా కోసం దర్శకుడు అద్భుతమైన కథను రాసుకున్నారు. రెండు భాగాలకూ సరిపడా కంటెంట్ ఆయన రాసిన కథలో ఉంది . మొదటి భాగం ఫలితాన్ని బట్టి రెండో భాగం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తాం’’ అని చెప్పారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానుంది.