40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘AMB’కు విజయ్ దేవరకొండ సపోర్ట్

ABN, Publish Date - Jan 31 , 2024 | 09:20 PM

సుహాస్ హీరోగా జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బిగ్ టికెట్‌ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Ambajipeta Marriage Band Team with Vijay Deverakonda

సుహాస్ (Suhas) హీరోగా జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా బిగ్ టికెట్‌ను స్టార్ హీరో హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సినిమాను చూసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మూవీ చాలా బాగుందంటూ ప్రశంసించారు. ఇదొక స్పెషల్ ఫిల్మ్ అని, తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.


ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ బిగ్ టికెట్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమా ప్రమోషన్‌లో భాగమవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా టీజర్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ మూవీ టీమ్‌లోని ప్రతి ఒక్కరూ నాకు దగ్గర వాళ్లు. ఈ ఫిబ్రవరి 2న థియేటర్స్‌లోకి ఈ స్పెషల్ మూవీ రాబోతోంది. ఈ సినిమా నేను చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, ఆర్టిస్టుల పర్‌ఫార్మెన్స్‌లు నెక్ట్ లెవెల్‌లో ఉన్నాయి. సుహాస్ ఎప్పటిలానే చాలా బాగా నటించాడు. శరణ్య అద్భుతంగా పర్‌ఫార్మ్ చేసింది. ఏ సినిమాకైనా ఫస్ట్ హాఫ్ చూశాక కొంత విరామం తీసుకునే నేను.. ఈ సినిమాకు కంటిన్యూగా ఫుల్ మూవీ చూశాను. అంత క్యూరియస్‌గా అనిపించింది. మీరు కూడా థియేటర్‌లో ఇదే ఫీల్ అవుతారు. అంతా ఈ సినిమాని థియేటర్లలో చూడండని చెప్పుకొచ్చారు. (Vijay Deverakonda about Ambajipeta Marriage Band)


ఇవి కూడా చదవండి:

====================

*Nandi Awards: నంది అవార్డ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

***************************

*Mrunal Thakur: ఆ హీరోతో ఆ అవకాశం రానందుకు చాలా బాధపడ్డా..

******************************

*Dheera: ‘ధీర’ ట్రైలర్ బాగుంది.. సినిమా మంచి హిట్టవుతుంది

****************************

*Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు.. విడుదల ఎప్పుడంటే?

**************************

Updated Date - Jan 31 , 2024 | 09:20 PM