మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vidya Vasula Aham: కపుల్ అన్నాక ఒకరు తగ్గాలి ఇంకొకరు నెగ్గాలి.. కానీ ఇద్దరూ నేనే నెగ్గాలి అనుకుంటే?

ABN, Publish Date - May 09 , 2024 | 06:38 PM

కపుల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రాహుల్ విజయ్, శివాని. అసలు పెళ్ళంటే ఇష్టం లేని వాసు, విద్యని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. కపుల్ అన్నాక సమయాన్ని బట్టి ఒకరు తగ్గాలి ఇంకొకరు నెగ్గాలి.. కానీ ఇద్దరూ నేనే నెగ్గాలి అని అనుకుంటే.. అదే ఇగోకి పోతే.. ఆ కాపురం ఎలా ఉంటుంది? ఆ పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే ‘విద్య వాసుల అహం’.

Vidya Vasula Aham Movie Still

కపుల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాని (Shivani Rajasekhar). అసలు పెళ్ళంటే ఇష్టం లేని వాసు, విద్యని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. కపుల్ అన్నాక సమయాన్ని బట్టి ఒకరు తగ్గాలి ఇంకొకరు నెగ్గాలి.. కానీ ఇద్దరూ నేనే నెగ్గాలి అని అనుకుంటే.. అదే ఇగోకి పోతే.. ఆ కాపురం ఎలా ఉంటుంది? ఆ పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే ‘విద్య వాసుల అహం’ (Vidya Vasula Aham). మరీ విద్య వాసులు ఇగోతోనే ఉంటారా? లేదా పెళ్ళైన కొత్తలో ఉండే మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తారా? అనేది ముందు ముందు వచ్చే అప్డేట్స్‌లో చూడాలి. (Vidya Vasula Aham Teaser Released)


ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ (Eternity Entertainment) బ్యానర్‌లో తన్విక, జశ్విక క్రియేషన్స్ పై మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మాతలుగా ఈ సినిమా రాబోతుంది. మణికాంత్ గెల్లి (Manikant Gelli) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. క్యారెక్టర్స్ మెచ్యుర్డ్‌గా ఆలోచించినప్పటికీ వారిద్దరి మధ్యలో ఈగో అనే వాల్‌ని బ్రేక్ చెయ్యనంత వరుకు వారి దాంపత్య జీవితంలోకి వెళ్ళలేరు అనే పాయింట్‌ని తీసుకుని, దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి.. ప్రేక్షకుల మన్ననలు పొందేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ ‘విద్య వాసుల అహం’ (ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరి) డైరెక్ట్‌గా ఆహా (Aha)లో త్వరలో రిలీజ్ కాబోతుంది అని చిత్రయూనిట్ వెల్లడించింది.

Read Latest Cinema News

Updated Date - May 09 , 2024 | 06:38 PM