అరకులో వెంకీ

ABN, Publish Date - Nov 09 , 2024 | 06:30 AM

వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా చిత్రీకరణ

వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. శుక్రవారం ఆఖరి షెడ్యూల్‌ను అరకులో యూనిట్‌ ప్రారంభించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో విద్యార్థులు వెంకటేశ్‌కు స్వాగతం చెబుతున్న సన్నివేశం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్‌ కథానాయికలు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి.

Updated Date - Nov 09 , 2024 | 06:31 AM