వేదం కాంబినేషన్‌

ABN, Publish Date - Nov 05 , 2024 | 06:50 AM

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ చిత్రం వచ్చి ఏడాది దాటింది. అప్పటి నుంచి అనుష్క నటించిన సినిమా ఏదీ రాలేదు. ఆమె కొత్త సినిమాల గురించి వార్తలు వినిపించాయి. వాటి మీద సోషల్‌ మీడియాలో చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఉన్నట్లుండి ‘ఘాటీ’...

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ చిత్రం వచ్చి ఏడాది దాటింది. అప్పటి నుంచి అనుష్క నటించిన సినిమా ఏదీ రాలేదు. ఆమె కొత్త సినిమాల గురించి వార్తలు వినిపించాయి. వాటి మీద సోషల్‌ మీడియాలో చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఉన్నట్లుండి ‘ఘాటీ’ అంటూ ఓ భారీ బడ్జెట్‌ చిత్రం న్యూస్‌ వచ్చింది. ఈ సినిమాకు క్రిష్‌ దర్శకుడు. విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్‌గా కూడా హిట్‌ అయిన ‘వేదం’ చిత్రం తర్వాత అనుష్క, క్రిష్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ఘాటీ’ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా భాగం వర్క్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెల ఏడుతో పూర్తవుతుందట. ఆ రోజే అనుష్క పుట్టినరోజు కావడంతో సినిమా ఫస్ట్‌ లుక్‌ను, ‘ఎ స్పెషల్‌ గ్లింప్స్‌ ఇన్‌ టు ద వరల్డ్‌’ని విడుదల చేయనున్నారు.


ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా ఆ రోజే వెల్లడించనున్నారు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ‘ఘాటీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Updated Date - Nov 05 , 2024 | 06:50 AM