విభిన్న పాత్రల్లో వరుణ్‌

ABN, Publish Date - Nov 05 , 2024 | 06:40 AM

వరుణ్‌ధావన్‌, కీర్తిసురేశ్‌ జంటగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘బేబీ జాన్‌’. వామికా గబ్బి, జాకీ ష్రాఫ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు...

వరుణ్‌ధావన్‌, కీర్తిసురేశ్‌ జంటగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘బేబీ జాన్‌’. వామికా గబ్బి, జాకీ ష్రాఫ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్‌ 25న విడుదలవుతోంది. చిత్రబృందం సోమవారం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. శక్తిమంతమైన పోలీసాఫీసర్‌గా, తండ్రిగా, వంటమనిషిగా విభిన్న పాత్రల్లో వరుణ్‌ కనిపించారు. కలీస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. జియోస్టూడియోస్‌, అట్లీ సమర్పణలో ప్రియా అట్లీ, మురాద్‌ ఖేతనీ, జ్యోతిదేశ్‌ పాండే నిర్మిస్తున్నారు.

Updated Date - Nov 05 , 2024 | 06:40 AM