మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ustaad Bhagat Singh: ‘భగత్స్ బ్లేజ్’.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం

ABN, Publish Date - Mar 19 , 2024 | 05:18 PM

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే దర్శకుడు హరీష్ శంకర్.. ఈ గ్యాప్‌లో రవితేజతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేయడంతో.. ఇంకేముంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆగిపోయిందనేలా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ.. ఊహించని విధంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుండి తాజాగా ‘భగత్స్ బ్లేజ్’ పేరుతో ఓ టీజర్ వదిలారు. ఇందులో గాజు గ్లాస్ డైలాగ్స్ హైలెట్ అవుతున్నాయి.

Pawan Kalyan in Ustaad Bhagat Singh

‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh)తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకొని సంచలనం సృష్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) మరోసారి సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే దర్శకుడు హరీష్ శంకర్.. ఈ గ్యాప్‌లో రవితేజతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేయడంతో.. ఇంకేముంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆగిపోయిందనేలా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ.. ఊహించని విధంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుండి తాజాగా ‘భగత్స్ బ్లేజ్’ పేరుతో ఓ టీజర్ వదిలారు. ఈ టీజర్‌తో సినిమాపై లేనిపోని రాతలు రాస్తున్నవారందకీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇక ‘భగత్స్ బ్లేజ్’ (Bhagat’s Blaze) విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడొచ్చిన ‘భగత్స్ బ్లేజ్’.. సినిమాపై భారీగా క్రేజ్ పెంచేలా ఉంది. మరీ ముఖ్యంగా గాజు గ్లాస్ గురించి పవన్ పలికిన డైలాగ్స్ హైలెట్ అనేలా ఉన్నాయి. యాక్షన్ టీజర్‌గా వచ్చిన ఈ ‘భగత్స్ బ్లేజ్’‌లో.. నీ రేంజ్ ఇది అంటూ.. విలన్ గాజు గ్లాస్‌ని చూపించి కింద పడేస్తే.. ‘గాజు పగిలేకొద్ది పదునెక్కిద్ది..’, ‘ఖచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం.. కనిపించని సైన్యం’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ గూజ్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే.. ఆ ఊచకోత చూస్తుంటే.. ‘గబ్బర్‌సింగ్’ శాంపిల్ మాత్రమే.. ఈసారి అసలు సిసలైన సినిమా రాబోతుందనే హింట్‌‌ని ఈ ‘భగత్స్ బ్లేజ్’ ఇస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Bhagat’s Blaze Talk)


ఈ సినిమా కోసం అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. గతంలో హరీష్ శంకర్‌తో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రానికి పని చేసిన అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్‌‌గా, ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా, ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయనున్నారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే సీనియర్ దర్శకుడు కె. దశరథ్ సమకూరుస్తున్నారు. (Ustaad Bhagat Singh Glass Teaser)


ఇవి కూడా చదవండి:

====================

*Kaliyugam Pattanamlo: ఏ యుగంలోనూ తల్లిని చంపే రాక్షసుడు పుట్టలేదు.. ట్రెండింగ్‌లో ట్రైలర్

******************

*Niharika Konidela: ఆరోజు రాడిస‌న్ బ్లూ ప‌బ్‌లో ఏం జరిగిందంటే..

**************************

Updated Date - Mar 19 , 2024 | 05:18 PM