కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉపేంద్ర ఫాంటసీ ప్రపంచం

ABN, Publish Date - Jan 09 , 2024 | 04:07 AM

కన్నడ నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్త్తున్న చిత్రం ‘యు ఐ ది మూవీ’. కె.పి.శ్రీకాంత్‌తో కలిసి లహరి ఫిల్మ్స్‌, జి.మనోహరన్‌ అండ్‌ వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి...

కన్నడ నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్త్తున్న చిత్రం ‘యు ఐ ది మూవీ’. కె.పి.శ్రీకాంత్‌తో కలిసి లహరి ఫిల్మ్స్‌, జి.మనోహరన్‌ అండ్‌ వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అల్లు అరవింద్‌ అతిథిగా విచ్చేశారు. ప్రేక్షకులను ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుందని, 90శాతం వీఎ్‌ఫఎక్స్‌తో ఉపేంద్ర ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారని నిర్మాతలు చెబుతున్నారు. ‘ఎటు చూసినా చీకటి.. దాన్నుంచి తప్పించుకోవడం ఎలా?’ అంటూ ఉపేంద్ర వాయి్‌సతో టీజర్‌ మొదలైంది. చివరిగా ఎద్దుపై ఉపేంద్ర వీరోచితమైన ఎంట్రీ, సినిమాలోని ఆయన పాత్రకు అద్దం పట్టేలా ఉంది. రీష్మా నానయ్య, నిధి సుబ్బయ్య, మురళీశర్మ, పి.శివశంకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీశ్‌ బి.లోక్‌నాథ్‌, కెమెరా: హెచ్‌సీ వేణుగోపాల్‌.

Updated Date - Jan 09 , 2024 | 04:07 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!