Upasana Konidela: నా సక్సెస్ షాడో రామ్‌చరణ్.. భర్తని ఆకాశానికెత్తిన ఉపాసన
ABN, Publish Date - Mar 07 , 2024 | 02:04 PM
నా సక్సెస్‌లో అతను నాకు షాడోలా ఉంటాడని అపోలో హస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్, మెగా కోడలు ఉపాసన తన భర్త రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాసన, తమ వ్యక్తిగత విషయాలను ఓ మీడియాతో పంచుకున్నారు.
నా సక్సెస్‌లో అతను నాకు షాడోలా ఉంటాడని అపోలో హస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్, మెగా కోడలు ఉపాసన (Upasana Konidela) తన భర్త రామ్ చరణ్ (RamCharan) పై ప్రశంసల వర్షం కురిపించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాసన, రామ్‌చరణ్ తమ వ్యక్తిగత విషయాలను ఓ మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్బంగా వారు ఒకరినొకరు ఏ విధంగా ఆర్థం చేసుకుంటూ ప్రేమగా ఉంటున్నది, తమ తమ రంగాల్లో ఎలా రాణిస్తున్నారనే అంశాలను ఈ సందర్బంగా వెల్లడించారు. సినిమాకు భిన్నమైన వైద్యుల కుటంబం నుంచి వచ్చిన ఉపాసన ఓ స్టార్ హీరోను పెండ్లి చేసుకున్నాక తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి చెబుతూనే ఆపోలో హస్పిటల్స్ వ్యవహారాలు చూసుకుంటున్న తనకు రామ్‌చరణ్ ఎలా చేదోడు వాదోడుగా ఉంటున్నాడో తెలిపింది.
నేను పుట్టిన తర్వాత నా జీవితంలో మహిళల పాత్రే కీలకంగా ఉన్నదని, మా తాత ప్రతాప రెడ్డి తన కుమార్తెలను చాలా ఆత్మవిశ్వాసంతో పెంచారని అదే నాకు కూడా వారసత్వంగా వచ్చిందన్నారు. అందుకే ఈ వ్యాపార రంగంలో అడుగు పెట్టానన్నారు. పెళ్లి తర్వాత నా ప్రపంచం పూర్తిగా మారిందని, అంతకుముందు నాకు తెలియని, పరిచయమే లేని సినిమా ఫ్యామిలీలో కుటుంబ సభ్యురాలిగా మారాక నా బాధ్యతలు రెట్టింపయ్యాయన్నారు.
ఇప్పుడు రామ్ చరణ్ ప్రోత్సాహం, తోడ్పాటు వళ్లే నేను నా బిజినెస్‌లో విజయవంతంగా రాణించగలుగుతున్నానని ఉపాసన ఉపాసన (Upasana Konidela) తెలిపింది. అంతేగాక నా ప్రతి అడుగులో రామ్ నాకు షాడోలాగా నిలబడడమే కాక ఓ హీరో భార్యగా కాకుండా వ్యక్తిగతంగా నీకంటూ ఓ ప్రత్యేక ఐడెంటిటీ ఏర్పర్చుకోవాలని అంటుంటారని, నిజంగా అలాంటి భర్త నాకు లభించడం నా అదృష్టమని పేర్కొంది.
ఇప్పుడు మా కుటుంబంలోకి కూతురు క్లిం కారా (Klin Kara) రాకతో మా బాధ్యతలు రెట్టింపయ్యాయని, ఓ తల్లిలా నా కూతురిని చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదివరకులా మల్టీపుల్‌గా చేసిన పనులు ఇప్పుడు కూడా చేయడం కాస్త ఇబ్బందికరమైనా ఏ మాత్రం వెనకడుగు వేయనని రామ్ సహకారంతో నా అన్ని వ్యాపారాలలో విజయవంతంగా రాణిస్తానన్నారు. నేనిప్పటికీ చెబుతున్నా.. నా విజయంలో రామ్‌చరణ్ పాత్ర కీలకమని అదే విధంగా అతని విజయంలోనూ నేను షాడోలానే ఉంటానని అంది. చాలామంది ప్రతీ మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని చెబుతుంటారని.. కానీ ప్రతీ ఆడదాని విజయం వెనుక ఓ మగాడు కూడా ఉంటాడని మరోమారు తెలిపింది.
ఇదిలాఉండగా.. ప్రస్తుతం దేశీయ కార్పోరేట్ రంగంలో చాలా మార్పులు రావాల్సి ఉందన్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత పెరిగేలా, సులభంగా ఉండేలా చూడాలని, వారు తాము చేసే పనులలో స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను మగవాళ్లు కలుగజేయాలని అన్నారు. అదేవిధంగా మహిళల మెటర్నిటీ సెలవుల విషయంలో ఫ్లెక్షిబుల్‌గా ఉండేలా చూసేందకు నేను కొన్ని కంపెనీలతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని ఉపాసన (Upasana Konidela) అన్నారు.