మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Upasana post Viral: బుడిబుడి అడుగులేస్తున్న క్లీంకార.. ఉపాసన పోస్ట్‌ వైరల్‌!

ABN, Publish Date - Jun 15 , 2024 | 09:57 PM

మెగా కోడలు సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! తన వృత్తి, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.  

మెగా కోడలు సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! తన వృత్తి, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.  తాజాగా మరో క్యూట్‌ ఫొటోతో నెటిజన్లను అలరించారు ఉపాసన(Upasana Konidela). రామ్‌ చరణ్‌తో (Ramcharan)పెళ్లి జరిగి 12 ఏళ్లు పూర్తయింది.  మెగా జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో వాళ్లందరికీ ధన్యవాదాలు  చెబుతూ క్యూట్‌ పోస్ట్‌ పెట్టారు. థ్యాంక్స్‌ చెప్పడంతోపాటు కూతురు క్లీంకార  తాజా ఫొటోను షేర్‌ చేశారు. ఇది కాస్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. (Ramcharan and Upasana 12 years of togetherness)
 

2012లో రామ్‌ చరణ్‌, ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు.  మెగా ఫ్యామిలీలో చరణ్‌-ఉపాసన.. వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ కపుల్‌గా గుర్తింపు పొందారు. వీళ్లకు గతేడాది జూన్‌లో కూతురు పుట్టింది. ఆ చిన్నారికి క్లీంకార అని పేరు పెట్టుకున్నారు. పుట్టినప్పటి నుంచి కూతురు ముఖం మాత్రం ఉపాసన బయటపెట్టలేదు. ఇప్పుడు కూడా తను, చరణ్‌.. కూతురిని నడిపిస్తున్నట్లు వెనక నుంచి ఉన్న ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. మెగా మనవరాలు  బుడిబుడి అడుగులు వేస్తుందని ఈ పోస్ట్‌తో చెప్పారు ఉపాసన. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated Date - Jun 15 , 2024 | 09:57 PM