రెండేళ్ల కృషి ఫలించింది
ABN, Publish Date - Sep 02 , 2024 | 04:05 AM
యం.యన్.వి. సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఇటీవల ఈ చిత్రం విడుదలై అందరినీ అలరిస్తున్న సందర్భంగా...
యం.యన్.వి. సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఇటీవల ఈ చిత్రం విడుదలై అందరినీ అలరిస్తున్న సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సాగర్ మాట్లాడుతూ ‘రెండేళ్ల మా కృషి ఫలించింది. మా సినిమాకు స్పందన బాగుంది. స్టార్స్ లేకున్నా కొత్త నటీనటులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా సినిమాలో హీరోయిన్లు ముగ్గురూ బాగా చేశారు. కిరాక్ కిరణ్ పాత్ర బాగా పండింది’ అన్నారు. హీరోయిన్లు హన్విక శ్రీనివాస్, ఉమా రేచర్ల, శ్రుతీ శంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.