రూ.రెండు కోట్ల విరాళం

ABN, Publish Date - Aug 08 , 2024 | 04:35 AM

కేరళలో వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డంతో జరిగిన విషాదం అందరికీ తెలిసిందే. ఈ విపత్తు బారిన పడిన బాధితులకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలు...

కేరళలో వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డంతో జరిగిన విషాదం అందరికీ తెలిసిందే. ఈ విపత్తు బారిన పడిన బాధితులకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందించి తమ వంతు సాయం చేశారు. బుధవారం ప్రభాస్‌ కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.రెండు కోట్ల విరాళం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇప్పటికే ఈ విపత్తు బారిన పడిన వారి కోసం తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా రూ.కోటి.. అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు అందజేశారు.

Updated Date - Aug 08 , 2024 | 04:35 AM