నిజమే గెలిచింది
ABN, Publish Date - Oct 09 , 2024 | 01:03 AM
తనతో పెళ్లికి నిరాకరించిందంటూ కథానాయిక మాల్వీ మల్హోత్రాపై కత్తితో దాడికి పాల్పడిన ఘటనలో నిర్మాత యోగేశ్ సింగ్‌ను దోషిగా తేల్చిన ముంబై కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది...
తనతో పెళ్లికి నిరాకరించిందంటూ కథానాయిక మాల్వీ మల్హోత్రాపై కత్తితో దాడికి పాల్పడిన ఘటనలో నిర్మాత యోగేశ్ సింగ్‌ను దోషిగా తేల్చిన ముంబై కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై మాల్వీ ఆనందం వ్యక్తం చేశారు. తన పోరాటం ఫలించిందని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఈ పోరాటంలో ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదుర్కొన్న నాకు తీర్పుతో ఉపశమనం లభించింది. నాలుగేళ్లుగా పోరాడుతున్నాను. ఎట్టకేలకు నిజం గెలిచింది. న్యాయం దక్కేవరకూ పోరాడే శక్తినిచ్చిన అమ్మవారికి ధన్యవాదాలు’ అని మాల్వీ పేర్కొన్నారు. 2020లో తనతో పెళ్లికి నిరాకరించిందనే కారణంతో మాల్వీని అడ్డగించిన యోగేశ్ కత్తితో దాడి చేశాడు.