40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tribute to Padma Shri award winners : పద్మశ్రీ అవార్డ్‌ విజేతలకు చిరు సత్కారం

ABN, Publish Date - Jan 31 , 2024 | 01:56 AM

పద్మశ్రీ పురస్కారం పొందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి ఎ.వేలు ఆనందాచారిలను పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీత మెగాస్టార్‌ చిరంజీవి సోమవారం తన ఇంట్లో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

పద్మశ్రీ పురస్కారం పొందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి ఎ.వేలు ఆనందాచారిలను పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీత మెగాస్టార్‌ చిరంజీవి సోమవారం తన ఇంట్లో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న యక్షగాన కళారూపానికి జీవం పోస్తున్న సమ్మయ్యకు పద్మశ్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. చిత్తూరు జిల్లా వెన్నంపల్లికి చెందిన ఆనందాచారి స్థపతిగా దేవాదాయశాఖలో పనిచేశారు. అనేక ఆలయ నిర్మాణాల కు శిల్పకళా నైపుణ్యాన్ని అందించారు. శిల్పశాస్త్ర విషయాలను శిల్పకళాకారులకు నేర్పిస్తూ ఆయన చేస్తున్న సేవలను చిరంజీవి కొనియాడారు. ఇలాంటి కళారూపాలను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చిరంజీవిని సమ్మయ్య, ఆనందాచారి కూడా సత్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళలను కాపాడాలని ఇరువురూ కోరారు.

Updated Date - Jan 31 , 2024 | 01:56 AM