మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా...

ABN, Publish Date - Oct 22 , 2024 | 02:15 AM

రాకేశ్‌ గలేబి, భార్గవ్‌ గోపినాథం, స్రవంతి ప్రత్తిపాటి, మానసవీణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్‌’. కోమల్‌.ఆర్‌.భరద్వాజ్‌ దర్శకత్వంలో...

రాకేశ్‌ గలేబి, భార్గవ్‌ గోపినాథం, స్రవంతి ప్రత్తిపాటి, మానసవీణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్‌’. కోమల్‌.ఆర్‌.భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. ఇటీవలే టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం, సోమవారం ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కోమల్‌.ఆర్‌.భరద్వాజ్‌ మాట్లాడుతూ ‘‘శ్రీ చక్రం ప్రేరణతో ఈ కథను తయారుచేశాను. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా విజువల్స్‌ ఉంటాయి’’ అని చెప్పారు. నవంబర్‌ 8న చిత్రం విడుదలవుతోంది.

Updated Date - Oct 22 , 2024 | 02:15 AM