Thrinadha Rao Nakkina: త్రినాధరావు బ్యానర్‌లో రెండో సినిమా.. హీరో, హీరోయిన్ ఎవరంటే?
ABN, Publish Date - Apr 03 , 2024 | 04:23 PM
‘ధమాకా’ సినిమాతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న స్టార్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన.. ఇప్పుడు నిర్మాతగా మారి నక్కిన నేరేటివ్స్ పేరుతో బ్యానర్ స్థాపించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభమైంది. బుధవారం ఈ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 2ను అనౌన్స్ చేశారు. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కుర్ర హీరో, హీరోయిన్ నటిస్తున్నారు.
‘ధమాకా’ సినిమాతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న స్టార్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన (Thrinadha Rao Nakkina).. ఇప్పుడు నిర్మాతగా మారి నక్కిన నేరేటివ్స్ (Nakkina Narratives) పేరుతో బ్యానర్ స్థాపించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభమైంది. బుధవారం ఈ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 2ను అనౌన్స్ చేశారు. ఆంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విక్రమ్ సహిదేవ్ లగడపాటి (Vikram Sahidev Lagadapati) హీరోగా నటిస్తుండగా, వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేష్ కుమార్తెగా కనిపించిన ఎస్తేర్ అనిల్ (Esther Anil), విక్రమ్ సహిదేవ్ లగడపాటి సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా, తారక్ పొన్నప్ప కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో త్రినాధరావు, నాయుడు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తపు షాట్‌కు హీరో సందీప్ కిషన్ క్లాప్ కొట్టగా, నిర్మాత శరత్ మరార్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో సుమంత్ తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.
*Kona Venkat: తెలుగమ్మాయి 50 సినిమాలు చెయ్యడం గొప్ప విషయం
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత త్రినాధరావు నక్కిన (Thrinadha Rao Nakkina) మాట్లాడుతూ.. ఈ చిత్రం నక్కిన నేరేటివ్స్ ప్రొడక్షన్ నెం.2. దీనికి టైటిల్ ఖరారు చేశాం. త్వరలోనే ప్రకటిస్తాం. నేను చాలా స్ట్రగుల్ అయి ఈ స్థాయికి వచ్చాను. నాలాగే ఎంతోమంది స్ట్రగుల్ అవుతుంటారు. అలాంటి వారికి నా శక్తికి తగ్గ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని అనుకున్నాను. దీనికి నా స్నేహితులు, మిత్రులు సపోర్ట్‌తో నక్కిన నేరేటివ్స్ నిర్మాణ సంస్థని స్థాపించాను. ‘సినిమా చూపిస్తా మామ’ వరకూ నేనే కథలు రాసేవాడిని. తర్వాత రాయలేదు. ‘నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా’ మా ప్రసన్న రాశారు.
అయితే ఈ సినిమా కోసం మళ్ళీ కథ రాశాను. ఇది కల్ట్ లవ్ స్టోరీ. టౌన్‌లో జరిగే అందమైన ప్రేమకథ. ఇందులో విలన్ పాత్ర కూడా చాలా కీలకమైనది. కథ అద్భుతంగా వచ్చింది. నాతో పాటు నరేష్, ఉదయ్ భాగవతుల స్క్రీన్‌ప్లేలో.. నరేష్, రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్‌లో పని చేశారు. దర్శకుడు వంశీ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇందులో విక్రమ్ పాత్ర అదిరిపోతుంది. విక్రమ్‌కి జోడిగా ఎస్తర్ చేస్తున్నారు. తనలో చాలా ప్రతిభ వుంది. పొన్నప్ప మరో కీలకమైన పాత్రలో కనిపిస్తారు.
దేవ్ జాంద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్‌గా వుంటుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులతో సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మిస్తున్నాం. దర్శకుడిగా ప్రేక్షకులు నన్ను గొప్పగా ఆదరించారు. నిర్మాతగా ఇప్పుడే అడుగులు వేస్తున్నాను. దీనికి కూడా పెద్దపీట వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఇందులో పని చేస్తున్న అందరికీ మంచి పేరు రావాలని కోరారు. (Nakkina Narratives Production No 2 Launched)
దర్శకుడు వంశీ కృష్ణ మల్ల (Vamsee Krishna Malla) మాట్లాడుతూ... త్రినాధరావు నక్కిన గారికి ధన్యవాదాలు. ఆయన చాలా ప్రేమించి రాసుకున్న కథని నా చేతిలో పెట్టారు. వందశాతం కష్టపడి ఆయన అనుకున్నదాని కంటే బెటర్ అవుట్‌పుట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఎక్కడా రాజీపడకుండా పెద్ద టెక్నిషియన్స్‌తో సినిమాని నిర్మిస్తున్నందుకు త్రినాధరావుగారికి ధన్యవాదాలు. మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచి మొదలుపెడుతున్నాం. అనకాపల్లి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తాం. ఇది మామూలు సినిమా కాదు. ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుందని తెలపగా.. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరో విక్రమ్ సహిదేవ్, హీరోయిన్ ఎస్తేర్ అనిల్ ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
====================
*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు
******************************
*Chiranjeevi: జారిపడినా డ్యాన్స్ ఆపలేదు, నాగపాములా ఆడుతూనే ఉన్నా! అప్పుడు మహానటి ఏమన్నారంటే?
**************************
*Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు
***********************