మెల్‌బోర్న్‌లో మువ్వన్నెల రెపరెపలు
ABN, Publish Date - Aug 18 , 2024 | 01:35 AM
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు రామ్‌చరణ్ గౌరవ అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ పురస్కారాన్ని...
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు రామ్‌చరణ్ గౌరవ అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ పురస్కారాన్ని శనివారం అందుకున్నారు. ఏటా ఈ పురస్కారం అందుకున్న వ్యక్తులు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఫెడరేషన్ స్క్వేర్‌లో ఘనంగా జరిగిన వేడుకల్లో రామ్‌చరణ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఐఎ్‌ఫఎ్‌ఫఎం పురస్కారాల ప్రధానం
ఐఎ్‌ఫఎ్‌ఫఎం చిత్రోత్సవాల్లో విజేతలకు పురస్కారాలను ప్రధానం చేశారు. చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారం స్వీకరించారు. ఉత్తమ దర్శకుడి పురస్కారాన్ని కబీర్‌ఖాన్, నిథిలన్ స్వామినాథన్ (మహారాజా)తో కలసి అందుకున్నారు. ఉత్తమ నటిగా పార్వతి తిరువోతు, ఉత్తమ చిత్రంగా ‘ట్వల్త్ ఫెయిల్’ పురస్కారాలను దక్కించుకున్నాయి. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడి పురస్కారం విక్రాంత్‌మాసేకు దక్కింది. సంగీత దర్శకుడు ఏ. ఆర్ రెహమాన్ విశిష్ట పురస్కారం స్వీకరించారు.