మానవత్వం చూపాల్సిన తరుణం ఇది

ABN, Publish Date - Aug 09 , 2024 | 12:46 AM

ఇటీవల కురిసిన భారీ వర్షాలు కేరళలోని వయనాడ్‌లో విషాదాన్ని మిగిల్చాయి. కొండ చరియలు విరిగి పడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులను...

ఇటీవల కురిసిన భారీ వర్షాలు కేరళలోని వయనాడ్‌లో విషాదాన్ని మిగిల్చాయి. కొండ చరియలు విరిగి పడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. కేరళ సీఎం రిలీఫ్‌ పండ్‌కు మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం కేరళ వెళ్లి నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలసి విరాళం చెక్కును అందజేశారు చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మానవత్వం చూపాల్సిన తరుణం ఇది. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ వంతుగా కేరళకు సాయం అందించాలి. ఈ దుర్ఘటనను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలి’ అని కోరారు.

Updated Date - Aug 09 , 2024 | 12:46 AM