హీరోగా మారిన విలన్ కథ ఇది
ABN, Publish Date - Aug 29 , 2024 | 04:21 AM
నేను ‘మగధీర’ చిత్రానికి కో డైరెక్టర్‌గా పనిచేశా. ఆ సమయంలోనే దేవ్ గిల్‌తో పరిచయం ఏర్పడింది. దేవ్ ఈ సినిమా ప్రపోజల్‌తో వచ్చాడు...
నేను ‘మగధీర’ చిత్రానికి కో డైరెక్టర్‌గా పనిచేశా. ఆ సమయంలోనే దేవ్ గిల్‌తో పరిచయం ఏర్పడింది. దేవ్ ఈ సినిమా ప్రపోజల్‌తో వచ్చాడు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది’ అన్నారు దర్శకుడు త్రికోటి. దేవ్ గిల్ హీరోగా నటించిన ‘అహో విక్రమార్క’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ నెల 30న ఆ సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇందులో దేవ్ గిల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. ఓ విలన్ హీరోగా మారితే ఎలా ఉంటుందనేది ఈ చిత్రకథ అనీ, మదర్ సెంటిమెంట్ కూడా ఉందనీ ఆయన తెలిపారు.