ఇప్పటివరకూ పోషించని పాత్ర ఇది

ABN, Publish Date - Nov 21 , 2024 | 06:15 AM

‘జెర్సీ’ ఫేమ్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. విష్వక్‌ సేన్‌ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా

‘జెర్సీ’ ఫేమ్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. విష్వక్‌ సేన్‌ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రద్ధా చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘‘ఈ సినిమాలో ఇప్పటివరకూ పోషించని ఓ డిఫరెంట్‌ పాత్రను పోషించాను. ఇందులో ‘మాయ’ పాత్రను ఒక సవాలుగా తీసుకుని నటించా. మెకానిక్‌ రాకీ జీవితంలో నా పాత్ర ఎలాంటి మార్పులు తెచ్చిందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో చాలా ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. డైరెక్టర్‌ రవితేజ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన దర్శకత్వ ప్రతిభ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. విశ్వక్‌తో నటించడం చాలా ఎంజాయ్‌ చేశా. ఆయన ఎనర్జీ లెవెల్స్‌ను మ్యాచ్‌ చేయటం కష్టం. జేక్స్‌ బిజోయ్‌ అందించిన మ్యూజిక్‌ సినిమాకు ప్రధానాకర్షణ. ఈ సినిమా అన్ని వర్గాల వారిని తప్పక అలరిస్తుంది’’ అని చెప్పారు.

Updated Date - Nov 21 , 2024 | 06:16 AM