ఇదొక రియల్ హీరో కథ
ABN, Publish Date - Oct 27 , 2024 | 05:54 AM
‘సాయిపల్లవి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో చూసిన ప్పుడే సినిమా విజయంపై నమ్మకం ఏర్పడింది. ఇదొక రియల్ హీరో స్టోరీ. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. కమల్‌హాసన్ నిర్మించేందుకు ముందుకు వచ్చారంటేనే ఈ సినిమా...
‘సాయిపల్లవి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో చూసిన ప్పుడే సినిమా విజయంపై నమ్మకం ఏర్పడింది. ఇదొక రియల్ హీరో స్టోరీ. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. కమల్‌హాసన్ నిర్మించేందుకు ముందుకు వచ్చారంటేనే ఈ సినిమా ఎంత ప్రత్యేకమైనదో అర్థం చేసుకోవచ్చు’ అని తమిళ హీరో శివకార్తికేయన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రమిది. కమల్‌హాసన్ నిర్మాణంలో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. సాయిపల్లవి కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘మేజర్ ముకుంద వరదరాజన్, ఇందు రెబకా అనే దంపతుల కథ ఇది. సైనికుల త్యాగాలు ఎలా ఉంటాయో రాజ్‌కుమార్ ‘అమరన్’లో అద్భుతంగా చూపించారు.
ప్రేక్షకులు తప్పక ఆదరించాలి’ అని కోరారు. సాయిపల్లవి మాట్లాడుతూ ‘నా ప్రతి సినిమా ప్రేక్షకులకు నచ్చాలనే అంకితభావంతో పనిచేస్తాను. అమరన్ సినిమాలో నా పాత్రను దర్శకుడు అద్భుతంగా మలిచారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.