The Great Pre Wedding Show: తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మొదలైంది

ABN, Publish Date - Oct 10 , 2024 | 06:15 PM

వైవిధ్య‌మైన పాత్ర‌లు, సినిమాల‌తో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా అతి తక్కువ సినిమాలతోనే త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో తిరువీర్. గురువారం హైదరాబాద్‌లో ఆయన నూతన చిత్రం మొదలైంది. ఈ చిత్ర ఓపెనింగ్ వివరాలివే..

The Great Pre Wedding Show Launch Event

వైవిధ్య‌మైన పాత్ర‌లు, సినిమాల‌తో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా అతి తక్కువ సినిమాలతోనే త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో తిరువీర్ (Thiruveer). ఇప్పుడాయన హీరోగా ఓ కొత్త సినిమా మొదలైంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (The Great Pre Wedding Show) పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. బై 7పి.ఎం ప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై రాహుల్ శ్రీనివాస్ (Rahul Srinivas) ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. తిరువీర్ సరసన ‘క‌మిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటిస్తోంది. ముహూర్తపు స‌న్నివేశానికి రానా ద‌గ్గుబాటి (Rana Daggubati) క్లాప్ కొట్టగా, సందీప్ అగ‌రం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాను స‌పోర్ట్ చేయ‌టానికి ఇక్క‌డ‌కు వ‌చ్చిన భళ్లాలదేవుడు దగ్గుబాటి రానాకు, ఇత‌ర సినీ పెద్ద‌లు, ప్ర‌ముఖులకు మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తున్నాము. కామెడీ డ్రామా జోన‌ర్‌లో సినిమాను రూపొందిస్తున్నాం. ద‌ర్శ‌కుడు రాహుల్ శ్రీనివాస్ కొత్త పాయింట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నాం. హీరో తిరువీర్‌కి థాంక్స్‌ అని అన్నారు. (The Great Pre Wedding Show Movie Launched)

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ వాయిదా? ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి వచ్చినా సమస్యే?



ద‌ర్శ‌కుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా కామెడీ డ్రామా మూవీగా అలరించనుంది. నవంబర్ 7 నుంచి ఎస్‌.కోట‌, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుప‌బోతున్నాం. అవ‌కాశం ఇచ్చిన హీరో తిరువీర్‌కి.. నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితారెడ్డిలకు ధ‌న్య‌వాదాలు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు మీడియాకు తెలియజేస్తామని తెలిపారు.

Also Read- Prabhas: ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడంటే

Also Read- Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో స్మోక్‌ చేస్తూ దొరికిన విష్ణుప్రియ‌.. వైర‌ల్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 10 , 2024 | 06:15 PM