Koratala Shiva : నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు
ABN, Publish Date - Sep 28 , 2024 | 05:46 AM
‘మా అందరి నాలుగేళ్ల కష్టమే ‘దేవర’ చిత్రం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లకు ధన్యవాదాలు. నందమూరి అభిమానులకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం. ‘దేవర’ కోసం దర్శకుడు కొరటాల శివ చాలా కష్టపడ్డారు.
కొరటాల శివ
‘మా అందరి నాలుగేళ్ల కష్టమే ‘దేవర’ చిత్రం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లకు ధన్యవాదాలు. నందమూరి అభిమానులకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం. ‘దేవర’ కోసం దర్శకుడు కొరటాల శివ చాలా కష్టపడ్డారు. ఎన్టీఆర్ ఇరగదీశాడు. తను వన్ మ్యాన్ షో చేశాడు. నాకెంతో గర్వంగా ఉంది’ అన్నారు కల్యాణ్‌రామ్. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ఆయన నిర్మించిన ‘దేవర’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్‌లో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత కొరటాల శివ మాట్లాడుతూ ‘ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మూడేళ్ల కష్టం ‘దేవర’. నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, సుధాకర్‌లకు ధన్యవాదాలు. చివరి నిముషం వరకూ అందరూ కష్టపడ్డారు. అందుకే ఇంత పెద్ద విజయం దక్కింది’ అన్నారు. ‘దేవర’ చిత్రాన్ని తెలంగాణలో విడుదల చేసిన దిల్ రాజు మాట్లాడుతూ ‘ స్టార్ హీరో సినిమా రిలీజ్ అనగానే పండగ వాతావరణం ఉంటుంది. నేను రాత్రి సినిమా చూశా. ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించిందంటే కారణం ఎన్టీఆరే. వన్ మ్యాన్ షోతో సినిమాను నిలబెట్టారు’ అన్నారు.