హిందువులేనా అని అడిగారు
ABN, Publish Date - Aug 27 , 2024 | 04:27 AM
కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు చేసుకునేందుకు మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన నటి నమిత దంపతులకు అవమానం ఎదురైంది. ప్రముఖుల దర్శన క్యూలైన్లో వెళ్ళిన వారిని...
కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు చేసుకునేందుకు మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన నటి నమిత దంపతులకు అవమానం ఎదురైంది. ప్రముఖుల దర్శన క్యూలైన్లో వెళ్ళిన వారిని ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. వీఐపీలు దర్శనానికి వస్తే వారి వివరాలను రిజిస్టర్‌లో పొందుపరచాల్సి ఉందని పేర్కొన్న సిబ్బంది.. ‘మీరు హిందువేనా?’ అని అడిగారు. తామిరువురమూ హిందువులమేనని, తమ కుమారుడికి శ్రీకృష్ణుడి పేరే పెట్టామని వారు వివరించారు. హిందువు అయితే నుదుట కుంకుమ పెట్టుకుని రావాలని ఆ సిబ్బంది నమితకు సూచించారు. ఆ మేరకు నమిత నుదుట కుంకుమ పెట్టుకుని ఆలయంలోకి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం నమిత దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. మీనాక్షి ఆలయ సిబ్బంది దురుసుగా వ్యహరించారని, తాము హిందువులమని ధ్రువీకరించేందుకు సర్టిఫికేట్ అడిగారని తెలిపారు. నమిత మాట్లాడుతూ.. మొట్టమొదటిసారిగా తాను హిందూమతానికి చెందినదానిని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.
చెన్నై, (ఆంధ్రజ్యోతి)