ఆ ప్రచారంలో నిజం లేదు

ABN, Publish Date - Nov 22 , 2024 | 04:59 AM

ఏ.ఆర్‌. రెహమాన్‌ దంపతులు ఇటీవలే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం.. ఇది జరిగిన కొద్ది గంటలకే రెహమాన్‌ టీమ్‌లో కీలక సభ్యురాలైన మోహిని దేవి కూడా తన భర్త నుంచి...

ఏ.ఆర్‌. రెహమాన్‌ దంపతులు ఇటీవలే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం.. ఇది జరిగిన కొద్ది గంటలకే రెహమాన్‌ టీమ్‌లో కీలక సభ్యురాలైన మోహిని దేవి కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ జంటల విడాకులకు ఏదో సంబంధం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే వీటిపై సైరా బాను తరపు న్యాయవాది వందనా షా స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టతనిచ్చారు. ‘‘పరస్పర అంగీకారంతోనే రెహమాన్‌, సైరా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వైవాహిక జీవితానికి స్వస్తి పలకడం ఎంతో బాధతో కూడుకున్న విషయం. ప్రస్తుతం వారిద్దరూ బాధలో ఉన్నారు. వివాహ బంధంలో సైరా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వారు విడిపోవడానికి కారణాలు ఉన్నాయి. వాటిని బహిర్గతం చేసే స్వేచ్చ నాకు లేదు. కలిసున్నా.. విడిపోయినా.. ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాలని ఇరువురూ భావిస్తున్నారు’’ అని వందనా షా తెలిపారు.

Updated Date - Nov 22 , 2024 | 04:59 AM