‘అవతార్ 3’ టైటిల్ వచ్చేసింది
ABN, Publish Date - Aug 11 , 2024 | 12:38 AM
‘టైటానిక్’, ‘టెర్మినేటర్’, చిత్రాలతో హాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా ఎదిగారు జేమ్స్ కామెరూన్. ఆయన తెరకెక్కిస్తున్న ‘అవతార్’ సిరీ్‌సలో మొదటి రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులను...
‘టైటానిక్’, ‘టెర్మినేటర్’, చిత్రాలతో హాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా ఎదిగారు జేమ్స్ కామెరూన్. ఆయన తెరకెక్కిస్తున్న ‘అవతార్’ సిరీ్‌సలో మొదటి రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. మొత్తం ఐదు భాగాలుగా ‘అవతార్’ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, అందరినీ ఊరిస్తున్న ‘అవతార్ 3’ టైటిల్‌ను దర్శకుడు విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ ’ఫైర్ అండ్ యాష్’. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇందులో పండోరా గ్రహాన్ని మరింత కొత్తగా చూపెడుతున్నాను. మరిన్ని అత్యద్భుత విజువల్స్, కట్టిపడేసే భావోద్వేగాలతో మూడో భాగం ఉంటుంది. మీ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడానికి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను’’ అని చెప్పారు. ఈ సినిమా వచ్చే ఏడాది, డిసెంబరు 19న విడుదల అవుతుంది.