నాగబంధం చుట్టూ తిరిగే కథ
ABN, Publish Date - Oct 15 , 2024 | 12:17 AM
‘డెవిల్ ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమాతో దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్న నిర్మాత అభిషేక్ నామా రూపొందిస్తున్న రెండో సినిమా ‘నాగబంధం.. ద సీక్రెట్ ట్రెజర్’. ‘పెదకాపు’ చిత్రంతో...
‘డెవిల్ ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమాతో దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్న నిర్మాత అభిషేక్ నామా రూపొందిస్తున్న రెండో సినిమా ‘నాగబంధం.. ద సీక్రెట్ ట్రెజర్’. ‘పెదకాపు’ చిత్రంతో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ ఇందులో హీరోగా నటిస్తున్నారు. నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లు. సోమవారం క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ ‘భారతదేశంలోని 108 విష్ణు ఆలయాలు నాగబంధం ద్వారా రక్షింపబడుతున్నాయి. ఆ నాగబంధం చుట్టూ తిరిగే కథ ఇది. భక్తి, అడ్వంచర్ ఎలిమెంట్స్ ఉంటాయి. స్పెషల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది’ అని చెప్పారు. నిర్మాత కిశోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ ‘హై బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. 2025లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తాం’ అని చెప్పారు.