మ్యూజిక్ షాప్ మూర్తి కథ
ABN, Publish Date - Feb 06 , 2024 | 12:43 AM
విలన్ పాత్రలతోనే కాదు కామెడీ రోల్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు అజయ్ ఘోష్. ఆయన కీలక పాత్రధారిగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రం తయారవుతోంది...
విలన్ పాత్రలతోనే కాదు కామెడీ రోల్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు అజయ్ ఘోష్. ఆయన కీలక పాత్రధారిగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రం తయారవుతోంది.. చాందినీ చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి శివ పాలడుగు దర్శకుడు. హర్ష గారపాటి నిర్మాత. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో అజయ్ ఘోష్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన పాత్ర వినోదభరితంగా ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. చాందినీ చౌదరి పాత్రకు, అజయ్ ఘోష్ పాత్ర ఉండే సంబంధం ఏమిటి, అసలు వీరిద్దరి కథ ఏమిటనేది ఆసక్తికరం అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: పవన్, ఛాయాగ్రహణం: శ్రీనివాస్ బెజుగమ్, ఎడిటింగ్: బొంతల నాగేశ్వరరెడ్డి.