పోరాట వీరుడి కథ
ABN, Publish Date - Dec 09 , 2024 | 03:15 AM
విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘విడుదల-2’. ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. నిర్మాత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు...
విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘విడుదల-2’. ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. నిర్మాత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు. కాగా, ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను కథానాయకుడు విజయ్ సేతుపతి చెన్నైలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ‘పెరుమాళ్ అనే పాత్రలో విజయ్ సేతుపతి అభినయం ఈ చిత్రానికి హైలెట్‌గా ఉండబోతోంది. పెరుమాళ్ పోరాట వీరుడిగా ఎలా మారాడు అనేది ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రంలో వెట్రిమారన్ ప్రజెంట్ చేశారు. తెలుగులో విజయ్ సేతుపతికి ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ చిత్రంలో ఎమోషన్స్, యాక్షన్ అన్నీ రియాల్టీకి దగ్గరగా ఉంటాయి. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది’ అని అన్నారు.
మంజువారియర్, సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్, రాజీవ్ మీనన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. కాగా, గతేడాది రిలీజైన ’విడుదల’ పార్ట్ 1 చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని సూపర్ హిట్‌గా నిలిచింది.