రెస్పాన్స్‌ బాగుంది

ABN, Publish Date - Aug 04 , 2024 | 03:43 AM

‘చాలా రోజుల తర్వాత ఒక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూశామని ప్రేక్షకులు అంటుంటే ఆనందంగా ఉంది’ అన్నారు దర్శకుడు విజయ్‌భాస్కర్‌....

‘చాలా రోజుల తర్వాత ఒక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూశామని ప్రేక్షకులు అంటుంటే ఆనందంగా ఉంది’ అన్నారు దర్శకుడు విజయ్‌భాస్కర్‌. శ్రీ కమల్‌, తాన్వీ ఆకాంక్ష జంటగా రూపొందిన ‘ఉషా పరిణయం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో చిత్రనిర్మాత, దర్శకుడు విజయభాస్కర్‌ మాట్లాడుతూ ‘కలెక్షన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రెస్పాన్స్‌ బాగుంది. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే మరిన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు వస్తాయి’ అన్నారు

Updated Date - Aug 04 , 2024 | 03:43 AM