నిర్మాతే హీరోయిన్!
ABN, Publish Date - Jan 17 , 2024 | 06:04 AM
ఒక తెలుగు యువతి సినిమాలో హీరోయిన్‌గా నటించడం, ఆ చిత్రానికి ఆమే నిర్మాత కావడం, కథను కూడా అందించడం అరుదుగా జరిగే విషయం. అలా మల్టీ టాలెంటెడ్‌గా సుమయా రెడ్డి ‘డియర్ ఉమ’ చిత్రంతో...
ఒక తెలుగు యువతి సినిమాలో హీరోయిన్‌గా నటించడం, ఆ చిత్రానికి ఆమే నిర్మాత కావడం, కథను కూడా అందించడం అరుదుగా జరిగే విషయం. అలా మల్టీ టాలెంటెడ్‌గా సుమయా రెడ్డి ‘డియర్ ఉమ’ చిత్రంతో అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ సంస్థ పతాకంపై ఆమె నిర్మిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్నారు. సాయి రాజేశ్ మహదేవ్ దర్శకుడు. ఈ సినిమా గురించి సుమయా రెడ్డి మాట్లాడుతూ ‘చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేస్తాం. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సాటే చక్కని సందేశం అందిస్తున్నాం. త్వరలో టీజర్ విడుదల చేస్తాం’ అని చెప్పారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారని, సినిమాలో లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్ అంశాలు ఉన్నాయనీ దర్శకుడు తెలిపారు. కమల్ కామరాజ్, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూపలక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం! రధన్, ఛాయాగ్రహణం:రాజ్ తోట.